Razole: రాజోలులో రైతుల కష్టాలను పరిశీలించిన వైసీపీ ఇన్చార్జ్

Razole: కోనసీమ జిల్లా రాజోలులో అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వైసీపీ నేత పాముల రాజేశ్వరి దేవి డిమాండ్ చేశారు.

PRABHU, RAZOLE
Published on: 3 May 2026 5:16 PM IST
Razole
X

Razole: రాజోలులో రైతుల కష్టాలను పరిశీలించిన వైసీపీ ఇన్చార్జ్

Razole: అకాల వర్షాలతో కన్నీరు పెడుతున్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రాజోలు వైసీపీ కో-ఆర్డినేటర్, మాజీ శాసన సభ్యురాలు పాముల రాజేశ్వరిదేవి డిమాండ్ చేశారు. మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామంలో హైవే పై వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం రాశులను ఆమె స్వయంగా పరిశీలించి, రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను నష్టాల నుండి గట్టెక్కించాలని,డీజిల్ కొరత కారణంగా కోతలు ఆలస్యమవ్వడం వల్లే పంట నీటిపాలైందని, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం గా విమర్శించారు. గత ప్రభుత్వం అందించిన విధంగానే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా సబ్సిడీలు ప్రకటించి ప్రతి రైతుకూ భరోసా కల్పించాలన్నారు.

అకాల వర్షంతో కుదేలైన అన్నదాతలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story