Rajole: డీఎస్సీపై సమగ్ర విచారణ జరపాలి పాముల రాజేశ్వరి దేవి!

Rajole: రాజోలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఛలో అమలాపురం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 28 July 2026 1:17 PM IST
Rajole
X

Rajole: డీఎస్సీపై సమగ్ర విచారణ జరపాలి పాముల రాజేశ్వరి దేవి!

Rajole: డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర న్యాయ విచారణ చేపట్టాలని వైఎస్సార్సీపీ రాజోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ పాముల రాజేశ్వరి దేవి డిమాండ్ చేశారు. పార్టీ అధినేత పిలుపు మేరకు నిర్వహించిన "ఛలో అమలాపురం" కార్యక్రమంలో భాగంగా రాజోలు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు అమలాపురానికి ర్యాలీగా బయలుదేరాయి.

డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం లోని గెద్దాడ గ్రామంలోని బైపాస్ రహదారిపై పార్టీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ, డీఎస్సీ అంశంపై పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారీ వాహనాలతో అమలాపురానికి తరలివెళ్లిన పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశాయి.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story