Kothapeta: కొత్తపేటలో వైఎస్సార్సీపీ విస్తృత ఎన్నికల ప్రచారం!
Kothapeta: डॉక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Kothapeta: కొత్తపేటలో వైఎస్సార్సీపీ విస్తృత ఎన్నికల ప్రచారం!
Kothapeta: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు ఈరోజు కొత్తపేట మండలంలో స్థానిక ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. కొత్తపేట మండల జడ్పీటీసీ అభ్యర్థి బండారు సత్తిరాజు (రాజా), మండలంలోని ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని, రోజువారీ కూలీ చేసుకునే కార్మికులు, చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు కుటుంబ ఖర్చులను నిర్వహించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కూరగాయలు, వంట నూనెలు, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో నెలవారీ కుటుంబ బడ్జెట్ తారుమారవుతోందని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటి అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలు, మహిళలకు ఇచ్చిన హామీలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు సంబంధించిన భరోసా వంటి అంశాలపై ప్రజల్లో నెలకొన్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. హామీల అమలు విషయంలో ప్రజలకు కలిగిన ఆశలు, ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బహిరంగంగా చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలు, ఎరువుల కొరత, వ్యవసాయ పెట్టుబడుల భారం, పంటలకు గిట్టుబాటు ధర వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలు గ్రామాల అభివృద్ధికి కీలకమని, ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకత్వాన్ని ఎన్నుకునే విషయంలో ప్రతి ఒక్కరూ అభ్యర్థుల పనితీరు, ప్రజలతో వారి అనుబంధం, గ్రామాభివృద్ధిపై వారి ప్రణాళికలను పరిశీలించాలని ఈ సందర్భంగా వివరించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తుందని చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి బండారు సత్తిరాజు (రాజా), ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




