Amalapuram: అమలాపురంలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి!

Amalapuram: అమలాపురంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా వైసీపీ సీనియర్ నేత కుంచే రమణారావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

SURESH, AMALAPURAM
Published on: 2 Sept 2026 9:51 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి!

అమలాపురం: దివంగత నేత,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా అమలాపురం నియోజకవర్గం హైస్కూల్ సెంటర్‌లో అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంచే రమణారావు పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కుంచే రమణారావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.పేదలు, రైతులు,మహిళలు,విద్యార్థులు, కార్మికులు,బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన అమలు చేసిన పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయి.

ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్‌మెంట్,జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో కోట్లాది కుటుంబాలకు వైఎస్సార్ అండగా నిలిచారు.ప్రజల కోసం నిరంతరం ఆలోచించిన మహానేతగా వైఎస్సార్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు అని అన్నారు.వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వేగిరాజు సాయిరాజు,సుదా గణపతి, మెండి రమేష్,ఉండ్రు రమేష్, పందిరి సుబ్బరాజు,పరమట రాజశేఖర్,నేరేడుమెల్లి శ్రీనివాసరావు, ఎం.గణేష్, మణికంఠ,వి.రమేష్ తదితరులు పాల్గొని నివాళి అర్పించారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story