Rajahmundry: తప్పు చేసిన పోలీసుల లిస్ట్ రాస్తున్నాం: మార్గాని భరత్

Rajahmundry: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, పోలీసు స్టేషన్లు టీడీపీ కార్యాలయాలుగా మారాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్గాని భరత్ తీవ్ర విమర్శలు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari
Published on: 19 Jun 2026 8:30 PM IST
Rajahmundry
X

Rajahmundry: తప్పు చేసిన పోలీసుల లిస్ట్ రాస్తున్నాం: మార్గాని భరత్

Rajahmundry: రాష్ట్రంలో రెడ్ బుక్కు రాజ్యాంగం అమలు అవుతుందని, ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు పెట్టడం , ఇళ్లల్లోకి జోరబడి కోట్టి చంపేస్తున్నారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మండి పడ్డారు. కూటమీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని, పోలీస్ స్టేషన్ లు తెలుగుదేశం కార్యాలయాలుగా మారాయని పోలీసు అధికారులు తెలుగుదేశం పార్టీ తాబేదారులు గా మారారని విమర్శించారు.

స్థానిక వైసిపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో మే నెలలో 23 సంవత్సరాల యువకుడ్ని పోలీసు లాకప్ లో చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన మేలో జరిగితే ముఖ్యమంత్రి జున్ లో స్పందించడం ఏమిటన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన జరుగుతుందా ప్రజాస్వామ్య

పాలన జరుగుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో అటవీక రాజ్యం నడుస్తుందని విమర్శించారు. ఇక చట్టాలు, న్యాయస్థానాలు ఎందుకని పోలీసులు ఇంట్లోకి వెళ్లి కొట్టి చంపేస్తున్నారని వారికి ఎవరు ఇచ్చారు అధికారం అని ప్రశ్నించారు. టిడిపి కార్యకర్తలకే ప్రాణహాని ఉందంటే వైసిపి కార్యకర్తలకు పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థమవు తుందన్నారు.

రాష్ట్ర హోంమంత్రి నియోజకవర్గ సమీపంలో తుని దగ్గర ఒక గ్రామంలో రెండేళ్ల చిన్నారి అదృశ్యమయ్యి 15 రోజులు గడిచిన ఆ చిన్నారి జాడకు కనుకోకపోవడం ప్రభుత్వ, పోలీసులు వైపల్యం తేటతెల్లమవుతుందని విమర్శించారు. తమ వద్ద ఆధునిక యంత్ర పరికరాలు ఉన్నాయని సాంకేతికత ఉందని గొప్పలు చెప్పుకుంటున్న పోలీస్ శాఖ చిన్నారిని ఇంతవరకు కనిపెట్టడం లేదని పోలీస్ శాఖ నిర్వీర్యం అయిందని విమర్శించారు.

కూటమి ప్రభుత్వ పెద్దల చెప్పు చేతల్లోఉన్న పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోవాలని చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి పేర్లు లిస్ట్ రాస్తున్నామని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరానికి చెందిన తమ పార్టీ బీసీ నాయకులు పీతారామకృష్ణను అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హమీ ఇచ్చారు. ఈ సమావేశంలో రామకృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో 13 సంవత్సరాల నమ్మకమైన జర్నలిజం ప్రయాణం. నిఖార్సైన వార్తలు, లోతైన విశ్లేషణలతో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story