Ravulapalem: రావులపాలెం ZPTC అభ్యర్థిగా మల్లిడి లావణ్య రామిరెడ్డి!
Ravulapalem: మండలం జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మల్లిడి లావణ్య రామిరెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రకటించి శుభాకాంక్షలు తెలిపారు.
Ravulapalem: రావులపాలెం ZPTC అభ్యర్థిగా మల్లిడి లావణ్య రామిరెడ్డి!
Ravulapalem: రావులపాలెం మండలం జడ్పిటిసి అభ్యర్థిగా మల్లిడి లావణ్య రామిరెడ్డి ను ప్రకటించి, అభినందించిన జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని రావులపాలెం మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా ఊబలంక గ్రామానికి చెందిన మల్లిడి లావణ్య రామిరెడ్డి ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రకటించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని చిర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులందరూ అభ్యర్థులకు అండగా నిలిచి, ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు.




