Sakhinetipalli: డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి రాజేశ్వరిదేవి

Sakhinetipalli: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది.

PRABHU, RAZOLE
Published on: 4 Aug 2026 8:59 PM IST
Sakhinetipalli
X

Sakhinetipalli: డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి రాజేశ్వరిదేవి

సఖినేటిపల్లి: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం ఉయ్యూరివారి మెరక గ్రామంలోని శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు కమ్యూనిటీ హాలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పాముల రాజేశ్వరిదేవి అధ్యక్షతన నిర్వహించారు.

కార్యక్రమం ప్రారంభానికి ముందు స్థానికంగా ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పాముల రాజేశ్వరిదేవి మాట్లాడుతూ ఇటీవల డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జరిగిన పరిణామాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. ఎ

న్నికల హామీలో భాగంగా నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి అందిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story