Razole: ఎస్సీ యువతకు జనరిక్ మెడిసిన్ యూనిట్లు కేటాయించాలి!

Razole: జనరిక్ మెడిసిన్ యూనిట్ల కేటాయింపులో ఎస్సీ యువతను పక్కన పెట్టడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

PRABHU, RAZOLE
Published on: 4 Sept 2026 10:11 AM IST
Razole
X

Razole: ఎస్సీ యువతకు జనరిక్ మెడిసిన్ యూనిట్లు కేటాయించాలి!

Razole: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు జనరిక్ మెడిసిన్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నప్పుడు, షెడ్యూల్డ్ కాస్ట్ (ఎస్సీ) యువతను ఎందుకు పక్కన పెడుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ ప్రశ్నించారు.

కొన్ని వర్గాల నిరుద్యోగ యువతకు జనరిక్ మెడిసిన్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.7.93 కోట్లు కేటాయించినప్పటికీ, అందులో ఎస్సీ నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

మాల ఫైనాన్స్ కార్పొరేషన్, మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్‌ల ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువతకు జనరిక్ మెడిసిన్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందించే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రాలేదని కిషోర్ ప్రశ్నించారు. ఇప్పటికే ఎస్సీ వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించే పలు పథకాలను పక్కన పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు స్వయం ఉపాధి కల్పించే అవకాశంలోనూ ఎస్సీ యువతను విస్మరించడం బాధాకరమన్నారు.

తెన్నేటి కిషోర్ డిమాండ్లు:

ఎస్సీ నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా జనరిక్ మెడిసిన్ యూనిట్లు ఏర్పాటు చేయాలి.

మాల, మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా అర్హులైన యువతకు ఆర్థిక రుణాలు అందించాలి.

ఎస్సీ యువతకు కూడా ప్రయోజనం కలిగేలా జనరిక్ మెడిసిన్ యూనిట్ల సంఖ్యను పెంచాలి.

ఎస్సీ యువతకు స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన కల్పించే చర్యలను ప్రభుత్వం తక్షణమే చేపట్టాలి.

ఎస్సీ యువతకు సమాన అవకాశాలు కల్పించి, వారి జీవన పరిస్థితులను మెరుగుపరిచేలా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని తెన్నేటి కిషోర్ కోరారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story