Chinturu: చింతూరులో వైసీపీ సునామీ.. 12కి 10 స్థానాలు, ఏకగ్రీవ ఎంపీపీ!

Chinturu: చింతూరు మండలంలో గురువారం జరిగిన ఎన్నికల్లో వైసీపీ 12 ఎంపీటీసీ స్థానాలకు 10 గెలుచుకోగా, ఎంపీపీగా చిచ్చడి మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 19 Nov 2026 7:08 PM IST
Chinturu
X

Chinturu: చింతూరులో వైసీపీ సునామీ.. 12కి 10 స్థానాలు, ఏకగ్రీవ ఎంపీపీ!

చింతూరు: చింతూరు మండలంలో వైఎస్ఆర్‌సీపీ దూసుకుపోయింది. మొత్తం 12 ఎంపీటీసీ స్థానాల్లో ఏకంగా 10 స్థానాలను కైవసం చేసుకుని ప్రత్యర్థులకు షాక్ ఇచ్చింది. మోతుగూడెంలో టీడీపీ, చట్టి లో బీజేపీ అభ్యర్థి మాత్రమే గెలవగలిగారు.ఎంపీపీగా వైఎస్ఆర్‌సీపీకి చెందిన చిచ్చడి మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా కల్లేరు ఎంపీటీసీ లేల భద్రయ్య ఎన్నికయ్యారు.

చింతూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామతులసి గెలిచిన 12 మంది ఎంపీటీసీలతో గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీపీ, ప్రజాప్రతినిధులు.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.చింతూరులో ఈ భారీ విజయం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR