Chintoor: చింతూరులో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు వైసీపీవే: రామలింగారెడ్డి
Chintoor: చింతూరు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో కైవసం చేసుకోనుందని మండల కన్వీనర్ రామలింగారెడ్డి తెలిపారు.
Chintoor: చింతూరులో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు వైసీపీవే: రామలింగారెడ్డి
చింతూరు: చింతూరు మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోనుందని మండల కన్వీనర్ వై. రామలింగారెడ్డి అన్నారు.మండలంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో దూసుకుపోతున్నారని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నామని, ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.




