Rajanagaram: నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: జక్కంపూడి రాజా!

Rajanagaram: రాజానగరం బస్టాండ్ సెంటర్లో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 7 Aug 2026 11:54 PM IST
Rajanagaram
X

Rajanagaram: నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: జక్కంపూడి రాజా!

రాజానగరం: రాష్ట్రంలో నిరుద్యోగ యువతతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమా డుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజనగరం బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాల శుక్రవారం నిర్వహించిన రిలే నిరాహార దీక్షలకు రాజా తో పాటు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి లు సంఘీభావం తెలిపారు

ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా లక్షలాది మంది యువత రోడ్లెక్కి కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చింది. నీట్ పరీక్ష తప్పులను వేలెత్తి చూపిం చి కేంద్రమంత్రి రాజీ నామా చేసేంతవరకు దేశంలో యువత పోరా టం సాగించింది. అదే ఉద్యమస్ఫూర్తితో వైఎస్ఆర్సిపి డీఎస్సీ అవకతవకలపై రాజీలేని పోరాటం సాగిస్తుంద న్నారు.3.5 లక్షల మంది మందు తరపున వైసిపి ఈ ప్రభుత్వాన్ని గొంతెత్తి నిలదీస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆందోళ నలు చేపట్టామన్నారు. ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డీఎస్సీలో తప్పులన్నిటికీ కాలుకు డైన మంత్రి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు .

వైఎస్ఆర్సిపి యువజన విభాగం విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఇప్పటికే అనేకమార్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ నలు చేపట్టడమైందన్నా రు. నిరసనలు, ర్యాలీలు చేసినప్పటికీ ఈ ప్రభు త్వం కళ్ళు తెరవలేదన్నా రు. మొద్దు నిద్రలో ఉన్నాయి ఈ ప్రభుత్వం కళ్ళు తెరి పించేందుకు ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే బాధ్యతను వైఎస్ఆర్సిపి తీసుకుందన్నారు. మూడున్నర లక్షల మంది జీవితాలతో చెలగాటం వాడుతున్న ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తా మన్నారు.

ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో రిలే నిరాహార దీక్షలు టౌన్ హాల్ మీటింగులు నిర్వహిస్తున్నామన్నారు. రాజానగరంలో నిరుద్యోగ యువత విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిలదీక్షలో నిర్వహించార న్నారు. యువతకు జరిగిన అన్యాయంపై నిలదీస్తుంటే నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చులకన భావంతో దాడులు చేయి స్తుందని ఫ్లెక్సీలపై మూ త్రం వేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం ఎంత దిగ జారుడుగా వ్యవహరి స్తుందో చూస్తున్నామ న్నారు. ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వారిని అనగదొక్కాలని కేసులు పెట్టాలని జైలుకు పంపడం కోర్టు చుట్టూ తిప్పాలనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తుంద న్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిలదీస్తా మన్నారు. లోకేష్ రాజీనామా చేసేంతవరకు ఉద్యమం ముందుకు తీసుకువెళ్తామన్నారు. నిరుద్యోగ యువతకు డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేకూర్చే అంతవరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. హామీలు అమలు చేయకపోగా ప్రతినిత్యం ఏ రకంగా ప్రత్యర్థులను అంతం చేయాలి కేసులు పెట్టాలి ఇబ్బందులు పెట్టాలి అనే ప్రయత్నంలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో కోటి మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పి ఒక్కొక్కరికి నెలకు రూ.3000 చొప్పున 26 -27 నెలలల్లో నిరుద్యోగ యువతకు ఈ ప్రభుత్వం రూ.70 వేల కోట్లు బకా యి పడిందన్నారు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదు వుకోవాలని ఉన్నత లక్ష్యంతో వైయస్సార్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమల్లోకి తెచ్చారన్నారు. 2014- 19 అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ పథకాన్ని నీరుకార్చారన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తిరిగి పథకానికి జీవం పోసి ఎప్పటికప్పుడు రియంబర్స్మెంట్ నిధులు అందించేవారన్నారు. కూటమి పాలనలో సారాయి,మద్యం,గంజా యి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నా యన్నారు. యువతను పక్కదారి పట్టించే విధం గా ఈ ప్రభుత్వం వ్యవహ రిస్తుందన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story