Siddipet: నాడు గేలి చేశారు.. నేడు చరిత్ర సృష్టించాం.. రాంరెడ్డి

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుటలో బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

Chindam Karunakar, Dubbak
Published on: 27 April 2026 2:59 PM IST
Siddipet
X

Siddipet: నాడు గేలి చేశారు.. నేడు చరిత్ర సృష్టించాం.. రాంరెడ్డి

Siddipet: వసిద్దిపేట జిల్లా తొగుట నాడైనా, నేడైనా, భవిష్యత్ లోనైనా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్షగా నిలుస్తుందని, తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ తొగుట మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రమైన తొగుటలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001 ఏప్రిల్ 27న ఇదే రోజున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పిడికెడు మందితో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ గురించి నాడు మఘలో పుట్టి పుబ్బలో పోతుందని, మర్రిచెన్నారెడ్డి లాంటి వారితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాలేదని గేలిచేశారన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story