Dubbak: ధర్మాజీపేట ధాన్యాన్ని ఈ రైస్ మిల్లులకు తరలించాలి: కౌన్సిలర్ వనం రమేష్
Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక ధర్మాజీపేట ఐకేపీ కేంద్రంలో మిగిలిన 3000 వడ్ల బస్తాల తరలింపునకు అధికారుల ఉత్తర్వులు.
Dubbak: ధర్మాజీపేట ధాన్యాన్ని ఈ రైస్ మిల్లులకు తరలించాలి: కౌన్సిలర్ వనం రమేష్
సిద్దిపేట జిల్లా: దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేట (బీరప్ప ఏరియా) 9వ వార్డులో ఉన్న ఐకేపీ మెప్మా వడ్ల కొనుగోలు కేంద్రంలో మిగిలిపోయిన వరి ధాన్యం సుమారు 3000 బ్యాగుల వరకు ఉంటుందని, వర్షం వస్తే బస్తాలు తడిసిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వీటిని రైస్ మిల్లులకు తరలించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్మాజీపేట 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కట్టా హైమావతికి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వనం రమేష్ గురువారం మీడియాతో మాట్లాడుతూ తాను చేసిన విజ్ఞప్తికి కలెక్టర్ వెంటనే స్పందించి డిఎస్ఓ కు దాన్యం తరలించేందుకు రైస్ మిల్లులను గుర్తించి ఐకేపీ నిర్వాహకులకు, రైస్ మిల్లులకు ఉత్తర్వులు అందజేయాలని సూచించారని పేర్కొన్నారు. కలెక్టర్ సూచనల మేరకు డిఎస్ఓ గురువారం ధర్మాజీపేట ఐకేపీ కేంద్రం నిర్వాహకులకు, రైస్ మిల్లుల యజమానులకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు.




