Siddipet: ఫీజు రీయింబర్స్‌మెంట్ పోరు!

Siddipet: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు.

RAJU, SIDDIPET
Published on: 12 July 2026 4:21 PM IST
Siddipet
X

Siddipet: ఫీజు రీయింబర్స్‌మెంట్ పోరు!

Siddipet: విద్యా సంస్థల సమస్యలు పరిష్కారం కొరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ నెల 14 న నిర్వహించ తలపెట్టిన కాళశాలల బంద్ ను విజయవంతం చేయాలనీ ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబెర్ ఆదిత్య పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడారు. రాష్ట్రం లో ఇప్పటి వరకు 12 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని మండిపడ్డారు.

దాదాపు 20 లక్షల పెద విద్యార్థుల జీవితాలు, చదువులు రియంబర్మెంట్ తో ముడిపడి ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఫీజు బకాయిలు లేకుండా చేస్తామన్న చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ పడుకున్నావని ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా బంద్ కు సంబందించిన వాల్ పోస్టర్ ని విడుదల చేశారు.కళాశాలల బంద్ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్యాలు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా కన్వీనర్ మృదులయ్య, నగర కార్యదర్శి తరుణ్,లోకేష్,ఆకాంక్ష్,పవన్, శ్రీకాంత్ లు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET

Next Story