Achyumayapalli: మంచి మనసున్న సర్పంచ్.. తన తొలి నెల జీతాన్ని అంగన్‌వాడీకే!
Achyumayapalli: సిద్దిపేట జిల్లా అచ్చుమాయపల్లి సర్పంచ్ పర్స దేవరాజ్ ముదిరాజ్ తన మొదటి నెల గౌరవ వేతనాన్ని అంగన్‌వాడీ కేంద్రం అభివృద్ధికి విరాళంగా ఇచ్చారు.
Achyumayapalli: మంచి మనసున్న సర్పంచ్.. తన తొలి నెల జీతాన్ని అంగన్‌వాడీకే!
సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం అచ్చుమాయపల్లి గ్రామ సర్పంచ్ మరియు సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు పర్స దేవరాజ్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు.
గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరచడం, ఫ్యాన్లు లైట్ల ఏర్పాటుకు అవసరమైన ఖర్చుల నిమిత్తం తనకు వచ్చిన మొదటి నెల గౌరవ వేతనాన్ని విరాళంగా అందజేశారు.
అంగన్‌వాడీ చిన్నారులకు మెరుగైన వాతావరణంలో విద్యా, పోషకాహార సేవలు అందేలా ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. సర్పంచ్ దేవరాజ్ అందించిన చెక్కును అంగన్‌వాడీ సిబ్బందికి అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, అంగన్‌వాడీ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు సర్పంచ్ దేవరాజ్ సేవాభావాన్ని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత ఇతర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది, విద్యార్థులు గ్రామస్తులు సర్పంచ్ దేవరాజ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.




