Dubbaka: దుబ్బాక ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలు ప్రారంభం: నెలకు రూ. 2000 స్కాలర్‌షిప్!

Dubbaka: దుబ్బాక ప్రభుత్వ ఐటీఐలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి అర్హతతో ప్రవేశం పొందిన వారికి నెలకు 2000 రూపాయల స్కాలర్‌షిప్ లభిస్తుందని ప్రిన్సిపాల్ కనకయ్య తెలిపారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 8 May 2026 9:29 PM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాక ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలు ప్రారంభం: నెలకు రూ. 2000 స్కాలర్‌షిప్!

Dubbaka: ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ/ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ , సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు సంస్థ ప్రిన్సిపాల్ G.కనకయ్య గారు తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థునులు ఐటీఐ/ ఏటీసీ లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అడ్మిషన్ పొందిన వారికి ప్రభుత్వం ప్రతినెల 2000 రూపాయలు స్కాలర్షిప్ అందిస్తుందని తెలియజేశారు.

సంస్థలో అనుభవజ్ఞులైన బోధకులచే నాణ్యమైన శిక్షణ, ఆధునిక యంత్ర సామగ్రితో ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించబడుతుందని తెలిపారు. శిక్షణ పూర్తయ్యిన అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని వివరించారు.

అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం & పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో సంస్థను సంప్రదించి అడ్మిషన్లు పొందవచ్చని సూచించారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story