Siddipet: పంట మార్పిడితోనే సిరిసంపదలు.. శాస్త్రవేత్తల కీలక ప్రకటన!
Siddipet: సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లిలో 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం నిర్వహించారు.
Siddipet: పంట మార్పిడితోనే సిరిసంపదలు.. శాస్త్రవేత్తల కీలక ప్రకటన!
సిద్దిపేట: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మెరుగైన సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు, వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని అక్బర్ పేట్ భూంపల్లి గ్రామంలోని రైతువే దికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, సిద్ది పేట మరియు వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నల వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, శాస్త్రవేత్త డా సి.హెచ్. పల్లవి తెలిపారు. శుక్రవారం రైతుల అవగాహన సదస్సు లో మాట్లాడుతూ... రైతు సోదరులకు ఆరు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ అవగా హన కార్యక్రమంలో భాగంగా యూరియావా డకాన్ని తగ్గించడం ద్వారా సాగు ఖర్చు తగ్గిం చుకోవచ్చునని, రసాయనాలను అవసరం మేరకు వినియోగించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, పంట మార్పిడి పాటించడం ద్వారా స్థిర ఆదాయం పొందవచ్చు.




