Akbarpet: అంగన్‌వాడీ భవన స్లాబ్ పనులు ప్రారంభించిన బక్కి వెంకటయ్య!

Akbarpet: సిద్దిపేట జిల్లా అక్బరుపేట గ్రామంలో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణ స్లాబ్ పనులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రారంభించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 11 July 2026 9:50 AM IST
Akbarpet
X

Akbarpet: అంగన్‌వాడీ భవన స్లాబ్ పనులు ప్రారంభించిన బక్కి వెంకటయ్య!

Akbarpet: సిద్దిపేట జిల్లా అక్బరుపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న నూతన అంగన్వాడి భవనానికి స్లాబ్ పనులను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ.బక్కి వెంకటయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు మెరుగైన విద్య, పోషకాహారం, ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

నూతన అంగన్వాడి భవనం పూర్తయిన తర్వాత గ్రామంలోని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తయ్యేలా అధికారులు, కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

గ్రామ అభివృద్ధికి అవసరమైన ప్రతి పనికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకటయ్య గారితో పాటు అక్బర్ పేట భూంపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మండల కుమార్, పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story