Bhumpally: అక్బర్‌పేట భూంపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
Bhumpally: కేంద్రంలో రూ.3,07,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
Bhumpally: అక్బర్‌పేట భూంపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
భూంపల్లి: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో మండలానికి సంబంధించిన రూ.3,07,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఎంతో అండగా నిలుస్తోందని తెలిపారు.పేదల ఆరోగ్య రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు కృషి చేస్తోందని పేర్కొన్నారు.
దేశంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని,అదే విధంగా ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్నబోయిన చంద్రశేఖర్ పాల్గొన్నారు.




