Siddipet: ఓటర్ల జాబితా సవరణపై ఆగ్రహం కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ దాకా ర్యాలీ!
Siddipet: సిద్దిపేటలో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని అఖిలపక్ష పార్టీల నిరసన ర్యాలీ. ఎన్నికల కమిషన్ తీరుపై నేతల తీవ్ర ఆగ్రహం.
Siddipet: ఓటర్ల జాబితా సవరణపై ఆగ్రహం కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ దాకా ర్యాలీ!
Siddipet: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియను తక్షణమే దేశవ్యాప్తంగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో సీపీఐ, సీపీఎం,కాంగ్రెస్, సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టి అనంతరం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో భాగంగా పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించేందుకు చర్యలు జరుగుతున్నాయని నేతలు ఆరోపించారు. తెలంగాణలో లక్షలాది మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నేతలు అన్నారు. ఎన్నికల కమిషన్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను నిలిపివేసి, తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ప్రజాస్వామ్యవాదులు, లౌకిక శక్తులు, వామపక్ష పార్టీలు కలిసి ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయని నేతలు ప్రకటించారు. ఎన్నికల వ్యవస్థలో ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్, గయాజుద్దీన్ సీపీఐ (యం-యల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మరియు సిపిఎం,సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్,కాముని గోపాల స్వామి,కిస్టపురం లక్ష్మణ్ , సందబోయిన ఎల్లయ్య, గోడ్డుబర్ల భాస్కర్ వామపక్ష పార్టీల నాయకులు శెట్టిపల్లి సత్తిరెడ్డి,వెంకట్, భాస్కర్,కొంగరి వెంకట మావో,చొప్పరి రవి కుమార్, బన్సీలాల్, కోదాడి యాదగిరి ,ప్రణయ్ కుమార్ , రామగల్ల నరేష్,దాసరి ప్రశాంత్, తిప్పారపు శ్రీనివాస్, అమ్ముల బాలనర్సయ్య, జాలిగపూ శిరీష,, పిట్ల మల్లేశం,కర్ణాలచంద్రం,పిల్లి రజిని,బిక్షపతి , ఆముదాల రంజిత్ రెడ్డి,వెంకటేష్, బద్దిపడగ కృష్ణారెడ్డి, నాగరాజు, శ్రీహరి,బక్కెళ్ళి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.




