Siddipet: అక్బర్‌పేట భూంపల్లిలో విత్తన దుకాణాల తనిఖీ

Siddipet: అక్బర్‌పేట భూంపల్లి మండల కేంద్రంలో నకిలీ విత్తనాల నివారణే ధ్యేయంగా వ్యవసాయ అధికారి బి. సత్యాన్వేష్, పోలీసులు కలిసి విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు.

KARUNAKAR,	DUBBAK
Published on: 17 Jun 2026 8:47 AM IST
Siddipet
X

Siddipet: అక్బర్‌పేట భూంపల్లిలో విత్తన దుకాణాల తనిఖీ

Siddipet: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని విత్తన డీలర్ల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి బి.స త్యాన్వేష్ పోలీసుశాఖ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీలర్లకు నకిలీ విత్తనాలు విక్రయించరాదని, అధిక ధర లకు అమ్మకాలు చేపట్టవద్దని సూచించారు.

ప్రతి రైతుకు తప్పనిసరిగా విత్తనాల కొనుగోలు బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే రైతుల అవస రాలను దృష్టిలో ఉంచుకొని సన్నరకం విత్తనాలను అందుబాటులో ఉంచా లని సూచించారు.

మండలంలో సోమవారం నుంచి యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైనట్లు చెప్పారు. యూరియా బుకింగ్, పంపిణీ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులు, డీలర్లు సహకారం అందిస్తారని తెలిపారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story