Husnabad: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దహనం!

Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను ప్రజా సంఘాల జేఏసీ నాయకులు దహనం చేశారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 5 Jun 2026 3:28 PM IST
Husnabad
X

Husnabad: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దహనం!

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల జేఏసి నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రజల పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.

తెలంగాణ ద్రోహులరా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ప్రధాని మోదీ నుండి బిజెపి నేతల వాఖ్యలు తెలంగాణ ప్రజలను, ఉద్యమాలను అవమాన పరిచే విధంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను అవమాన పరిచే విధంగా తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కోస్తాంద్ర వాళ్ళ కొబ్బరి చెట్లు మాడిపోయాయని అనడం దుర్మార్గమని మండి పడ్డారు.

తెలంగాణ ద్రోహులు తెలంగాణను ఆగం చేస్తున్నారని, గద్దర్ ను అవమాన పరుస్తున్నారని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సీమాంద్ర పెట్టుబడి దారులే నడిపిస్తున్నారని, వారి కుట్రలు ఇక నడువవన్నారు. ఇకనైనా తెలంగాణ ఉద్యమం పై, ప్రజల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD

Next Story