Siddipet: మోతే గ్రామంలో చైర్మన్ బక్కి వెంకటయ్య పర్యటన
Siddipet: సిద్దిపేట జిల్లా మోతే గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించి పూజలు చేశారు.
Siddipet: మోతే గ్రామంలో చైర్మన్ బక్కి వెంకటయ్య పర్యటన
Siddipet: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రార్థనలు చేశారు.
ఆలయ అర్చకులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని చైర్మన్ వెంకటయ్య గారిని ఆశీర్వదించారు. అనంతరం గ్రామంలోని ప్రైమరీ స్కూలును సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన విద్య మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా లేదా అని ప్రత్యక్షంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంలో చైర్మన్ వెంకటయ్య గారితో పాటు అక్బరు పేట-భూంపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మండల కుమార్, భూంపల్లి సర్పంచ్ జన్నారెడ్డి, మోతే మాజీ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్, రాచమల్లు రమేష్, బాలు, ఇతరులు పాల్గొన్నారు.




