Dubbaka: గుడికందులలో బెల్ట్ షాపు వివాదం.. ఉద్రిక్తత, పోలీసుల లాఠీచార్జి!
Dubbaka: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం గుడికందులలో బెల్ట్ షాపు వివాదం, ఉద్రిక్తత. పోలీసుల లాఠీచార్జి, ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.
Dubbaka: గుడికందులలో బెల్ట్ షాపు వివాదం.. ఉద్రిక్తత, పోలీసుల లాఠీచార్జి!
Dubbaka: దసరా పండుగ రోజు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం గుడికందులలో బెల్ట్ షాపు వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆగ్రహించిన గ్రామస్థులు బెల్ట్ షాపు ఎదుట గుమిగూడటంతో ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం అందుకున్న సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్థులకు మధ్య కూడా వాగ్వాదం జరగ డంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీ సులు లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బుధవారం తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు ఏసీపీ రవీందర్రెడ్డి, దుబ్బాక సీఐ జాన్ రెడ్డి ఆధ్వర్యంలో తొగుట,మిరుదొడ్డి,దుబ్బాక పోలీసులతో గ్రామంలో పికెటింగ్ నిర్వహించారు. ఈ ఘటనలో కొందరిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ కేసు ఘర్షణకు గుడికందులలో జరిగిన ఘర్షణకు సంబంధించి ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.




