Siddipet: ప్రశ్నించే తత్వమే భగత్ సింగ్‌కు నిజమైన నివాళి: ఎస్ఎఫ్ఐ!
Siddipet: సిద్దిపేటలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జిల్లా అధ్యక్షుడు అభిషేక్ భాను పిలుపు.
Siddipet: ప్రశ్నించే తత్వమే భగత్ సింగ్‌కు నిజమైన నివాళి: ఎస్ఎఫ్ఐ!
సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని భగత్ సింగ్ విగ్రహానికి ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బత్తుల అభిషేక్ భాను పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బత్తుల అభిషేక్ భాను మాట్లాడుతూ, భగత్ సింగ్ కేవలం ఒక విప్లవకారుడిగానే కాకుండా, ప్రశ్నించే తత్వం, శాస్త్రీయ దృక్పథం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన యువతకు ఆదర్శమని అన్నారు.
నేటి విద్యార్థులు భగత్ సింగ్ జీవితాన్ని కేవలం జయంతి రోజున గుర్తు చేసుకోవడం కాకుండా, ఆయన ఆలోచనలను అధ్యయనం చేసి సమాజంలోని అన్యాయాలను ప్రశ్నించే ధైర్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండి శాస్త్రీయ ఆలోచనను అలవర్చుకోవాలని, విద్యార్థుల హక్కులు మరియు సామాజిక న్యాయం కోసం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
“భగత్ సింగ్‌ను స్మరించడం అంటే ఆయన చిత్రపటానికి లేదా విగ్రహానికి పూలమాల వేయడం మాత్రమే కాదు; ఆయన ఆలోచనలను అర్థం చేసుకుని, సమాజ మార్పు కోసం ముందుకు సాగడమే నిజమైన నివాళి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మోయా విష్ణు మధు సాయికిరణ్ వినయ్ విష్ణు తేజ నవదీప్ తదితరులు పాల్గొన్నారు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




