Akkanapet: రైతు వేదిక ఎదుట బీజేపీ నాయకుల నిరసన!
Akkanapet: అక్కన్నపేటలో ఎల్ నినో ప్రభావిత రైతులకు నష్టపరిహారం అందించాలని, సబ్సిడీపై ప్రభుత్వ విత్తనాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ నాయకులు నిరసన తెలిపారు.
Akkanapet: రైతు వేదిక ఎదుట బీజేపీ నాయకుల నిరసన!
Akkanapet: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదిక ఎదుట బిజెపి నాయకులు నిరసన తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో నష్టపోతున్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు వేదికలో అందిస్తున్న విత్తనాలలో ప్రైవేటు కంపెనీల విత్తనాలు కాకుండా ప్రభుత్వ కంపెనీల విత్తనాలను సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ కార్యక్రమాలకు సంబంధించి రైతులకు క్షేత్రస్థాయిలో నేరుగా సమాచారం అందివ్వడం లేదని వ్యవసాయ అధికారులను నిలదీశారు. రైతులకు వాట్సప్ మెసేజ్ లు కాకుండా నేరుగా సమాచారం ఇవ్వాలన్నారు.
Next Story




