Husnabad: ప్రజల ప్రాణాల కంటే రైస్‌మిల్లే ముఖ్యమా: బీజేపీ నేత పృథ్విరాజ్ గౌడ్ ధ్వజం

Husnabad: హుస్నాబాద్ శ్రీ ఆగ్రో రైస్‌మిల్ వద్ద రాంగ్ రూట్ ట్రాక్టర్లు, పార్కింగ్ లేకపోవడం వల్ల వరుస ప్రాణనష్టం జరుగుతోందని బీజేపీ నేత పృథ్విరాజ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 10 Nov 2026 9:33 PM IST
Husnabad
X

Husnabad: ప్రజల ప్రాణాల కంటే రైస్‌మిల్లే ముఖ్యమా: బీజేపీ నేత పృథ్విరాజ్ గౌడ్ ధ్వజం

Husnabad: పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ బీజేపీ సిద్ధిపేట్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ. హుస్నాబాద్‌లోని శ్రీ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్‌మిల్ వద్ద పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, ట్రాక్టర్ల రాకపోకలకు సరైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, హైవేపై రాంగ్ రూట్‌లో వాహనాలు నడపించడం వల్ల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ ప్రాంతంలో జరిగిన ప్రమాదాల్లో ఆరు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె ప్రాణాలు కోల్పోగా, తల్లి, కుమారుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

ఇంతటి విషాదం జరిగిన మరుసటి రోజే మళ్లీ అదే ప్రాంతంలో ట్రాక్టర్లు రాంగ్ రూట్‌లో హైవేపైకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కనీసం హెచ్చరిక బోర్డులు లేవు.. సరైన పార్కింగ్ ఏర్పాట్లు లేవు.. ట్రాఫిక్ నిబంధనల అమలుపై పర్యవేక్షణ కనిపించడం లేదు.

ప్రజల ప్రాణాల కంటే రైస్‌మిల్ కార్యకలాపాలే ముఖ్యమా?

రైస్‌మిల్‌కు వచ్చే ట్రాక్టర్లకు ప్రత్యేక పార్కింగ్ స్థలం ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? హైవేపై రాంగ్ రూట్‌లోకి వాహనాలు రాకుండా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రైస్‌మిల్‌కు సమీపంలోనే 100 మీటర్ల పరిధిలో వెయ్‌బ్రిడ్జ్ ఉన్న అంశంపై నిబంధనల ప్రకారం అధికారులు పరిశీలించారా? నిబంధనలు ఉల్లంఘన జరిగితే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?

ఒకవైపు ప్రమాదాల్లో కుటుంబాలు రోడ్డున పడుతుంటే.. మరోవైపు అదే తప్పులు పునరావృతం కావడం ఏమిటి?

సంబంధిత రైస్‌మిల్ యాజమాన్యం, జాతీయ రహదారుల అధికారులు, పోలీస్, రవాణా శాఖ, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలి.

రైస్‌మిల్‌కు ప్రత్యేక పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలి.

ట్రాక్టర్ల రాకపోకలకు ప్రత్యేక మార్గం కల్పించాలి.

రాంగ్ రూట్‌ను పూర్తిగా అరికట్టాలి.

అవసరమైన హెచ్చరిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు చేయాలి.

గత ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

వెయ్‌బ్రిడ్జ్ ఏర్పాటు, దూరం, సంబంధిత నిబంధనలపై అధికారులు స్పష్టత ఇవ్వాలి.

ఇకనైనా అధికారులు కళ్లు తెరవాలి. మరో కుటుంబం రోడ్డున పడకముందే చర్యలు తీసుకోవాలి.

లేదంటే ఈ సమస్యపై జిల్లా కలెక్టర్‌కు ఆధారాలతో కూడిన వినతిపత్రం అందించి, ప్రజల ప్రాణాల రక్షణ కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం.

వ్యాపారాలు చేసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారాలు చేసే పరిస్థితిని మాత్రం సహించేది లేదు అని పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ హెచ్చరించారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD