Toguta: బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎల్లయ్య మృతి

Toguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటకు చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎల్లయ్య మృతి చెందారు.

Chindam Karunakar, Dubbak
Published on: 10 May 2026 11:52 AM IST
Toguta
X

Toguta: బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎల్లయ్య మృతి

తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఈదుగాళ్ల పర్శరాములు తండ్రి ఎల్లయ్య (70) గారు ఆదివారం తెల్లవారు జామున మరణించారు..విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి గ్రామ సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ తో కలిసి ఆయన భౌతిక కాయనికి నివాళులు అర్పించి ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబీకులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో ఉప సర్పంచ్ లచోళ్ల లింగం, వార్డు సభ్యులు పిట్ల వెంకటేష్, నాయకులు డబ్బికారి పెంటోజీ, పిట్ల వెంకటయ్య, పాత్కుల బాలేష్, బెజ్జనమైన కనకరాజు, షఫీ, బయ్యారం స్వామి గౌడ్, తడ్గం నర్సింహారెడ్డి, పులిగారి నర్సింలు, టంకరి లింగం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story