Siddipet: భాగ్య కుటుంబానికి అండగా నిలుస్తాం.. తోట కమలాకర్ రెడ్డి హామీ
Siddipet: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన భాగ్య (రూపీ) కుటుంబాన్ని బీఆర్‌ఎస్ నాయకుడు తోట కమలాకర్ రెడ్డి పరామర్శించారు.
Siddipet: భాగ్య కుటుంబానికి అండగా నిలుస్తాం.. తోట కమలాకర్ రెడ్డి హామీ
Siddipet: గత వారం రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన రంగమైన భాగ్య అలియాస్ రూపీ కుటుంబాన్ని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి పరామర్శించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన భాగ్య మరణం తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 25 సంవత్సరాలుగా ఉద్యమంలో పనిచేస్తూ కుటుంబాన్ని పక్కనబెట్టి ప్రజల కోసం కృషి చేసిన వ్యక్తి ఈ విధంగా ఎన్‌కౌంటర్‌లో మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు. ప్రభుత్వాలు లొంగుబాటు అవకాశాలు కల్పిస్తున్న సందర్భంలో సమాజం మార్పు దిశగా ముందుకు వెళుతుంటే అలాంటి సమయంలో ఆమె కూడా లొంగిపోయి ప్రజల మధ్య ఉండి సేవలు అందించి ఉంటే మరింత మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. భాగ్య కుటుంబం నిరుపేద పరిస్థితుల్లో ఉందని, వారికి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఒక క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు.




