Siddipet: తొగుట మండలంలో మృతి చెందిన వారి కుటుంబాల పరామర్శ!

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, స్థానిక నేతలు.

Chindam Karunakar, Dubbak
Published on: 9 Oct 2026 11:53 AM IST
Siddipet
X

Siddipet: తొగుట మండలంలో మృతి చెందిన వారి కుటుంబాల పరామర్శ!

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్‌లో విద్యుత్ ఆపరేటర్ దూలం నాగరాజు అకాల మరణం బాధాకరమని బీఆర్‌ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విచారం వ్యక్తం చేశారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు చెరుకు లక్ష్మారెడ్డితో కలిసి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.. అందరితో కలివిడిగా ఉండే నాగరాజు మరణం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటన్నారు.. అలాగే ఎల్.బంజేరుపల్లికి చెందిన ఆల్వాల విట్టల్ గౌడ్ మరణించగా, ఆయన భౌతిక ఖాయానికి గ్రామ సర్పంచ్ పిట్ల నర్సింలు, గ్రామ పార్టీ అధ్యక్షుడు సూరంపల్లి స్వామితో కలిసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతరం జాప్తిలింగారెడ్డిపల్లిలో తన స్నేహితుడు బట్టు తిరుమల్ తల్లి సత్తమ్మ మృతి చెందడంతో గ్రామ సర్పంచ్ బక్క కనకయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డితో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak