Siddipet: హరీష్ రావుపై కవిత ఆరోపణలపై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు
Siddipet: హరీష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ నాయకుడు కాముని శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.
Siddipet: హరీష్ రావుపై కవిత ఆరోపణలపై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు
సిద్దిపేట: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హరీష్ రావుపై చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాముని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, సర్పంచ్ ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు కాముని ఉమేష్ చంద్ర, రైతు బంధు జిల్లా మాజీ డైరెక్టర్ మేడికాయల వెంకటేశం, మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, కొండం రవీందర్ రెడ్డి, సర్పంచ్ లు ఇట్టబోయిన శ్రీనివాస్, రేగుల దేవయ్య, పుచ్చకాయల సురేందర్ రెడ్డి లతో కలసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహానికి అనుగుణంగానే కవిత వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాముని శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు.
ఈరోజు కవిత మాట్లాడుతున్న మాటలే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారా?
అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. లిక్కర్ కేసు వ్యవహారంలో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కవిత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాజకీయ సంబంధాల దిశగా కవిత ప్రయాణం సాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.
హరీష్ రావుపై ఆరోపణలు చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి!
తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఉద్యమ నాయకుల త్యాగాలు, రాజకీయ సంప్రదాయాలను గుర్తుంచుకోవాలని కాముని శ్రీనివాస్ సూచించారు. తెలంగాణ సమాజం కేసీఆర్, హరీష్ రావుల నాయకత్వాన్ని గౌరవిస్తూ కవితకు కూడా రాజకీయంగా, సామాజికంగా స్థానం కల్పించిందని అన్నారు. అలాంటి నాయకులపైనే ఇప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఒకప్పుడు కవిత కష్టకాలంలో ఉన్నప్పుడు హరీష్ రావు అందించిన సహాయ సహకారాలను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. రాజకీయంగా విభేదాలు ఉండవచ్చు, వ్యక్తిగత అభిప్రాయాలు వేరుగా ఉండవచ్చు. కానీ గతంలో అండగా నిలిచిన వారి పట్ల కనీస కృతజ్ఞతను మరిచిపోవడం తగదని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును మరిచిపోతే తెలంగాణకు జరిగిన మేలును విస్మరించినట్లే!
కేసీఆర్, హరీష్ రావుల నాయకత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వ్యవసాయ రంగానికి అందించిన ప్రాధాన్యతను కవిత గుర్తుంచుకోవాలని కాముని శ్రీనివాస్ అన్నారు. తెలంగాణలో సాగునీటి అవసరాలు, రైతుల భవిష్యత్తు, నీటి వనరుల అభివృద్ధి వంటి అంశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కీలకమైన చర్చనీయాంశమని పేర్కొన్నారు.
రాజకీయ విమర్శల పేరుతో గతంలో జరిగిన అభివృద్ధి ప్రయత్నాలను, నాయకుల కృషిని పూర్తిగా విస్మరించడం సరికాదని అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కంటే వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన ప్రజల్లో కలగకుండా కవిత తన వ్యాఖ్యలపై పునరాలోచన చేయాలని సూచించారు.
వ్యక్తిగత స్వలాభం కోసం రాజకీయ విలువలను దిగజార్చవద్దు!
రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ, విమర్శలకు ఒక హద్దు, రాజకీయాల్లో ఒక సంస్కారం ఉండాలని కాముని శ్రీనివాస్ అన్నారు. గతంలో కలిసి పనిచేసిన నాయకులపైనే వ్యక్తిగత ఆరోపణలు చేయడం, తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాన్ని మరియు అభివృద్ధి కార్యక్రమాలను పక్కనపెట్టడం తగదని హితవు పలికారు.
హరీష్ రావుపై ఆరోపణలు చేసే ముందు ఆయన గతంలో అందించిన సహకారాన్ని గుర్తుచేసుకోవాలని, రాజకీయంగా ఎంత ఎత్తుకు ఎదిగినా కృతజ్ఞతాభావాన్ని కోల్పోకూడదని అన్నారు.
హరీష్ రావుకు క్షమాపణ చెప్పాలి – కాముని శ్రీనివాస్ డిమాండ్
హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను కవిత పునఃపరిశీలించి, తన మాటలకు బాధ్యత వహించాలని కాముని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్వప్రయోజనాల కోసం రాజకీయ విమర్శల స్థాయిని దిగజార్చకుండా, గతంలో చేసిన సహాయాన్ని గుర్తుచేసుకొని హరీష్ రావుకు క్షమాపణ చెప్పాలని ఆయన హితవు పలికారు.
ఇట్టి కార్యక్రమంలో కాముని శ్రీనివాస్, ములకల కనకరాజు, జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కాముని ఉమేష్ చంద్ర, మేడికాయల వెంకటేశం, కీసరి పాపయ్య, కొండం రవీందర్ రెడ్డి, సర్పంచులు ఇట్టభోయిన శ్రీనివాస్, రేగుల దేవయ్య, మాజీ సర్పంచ్ పుచ్చకాయల సురేందర్ రెడ్డి, నాయకులు పంపరి కనకయ్య, గొల్లపల్లి రాజశేఖర్ రెడ్డి, మన్నే ఆనంద్, ఎలుక నవీన్, చెట్టుపల్లి భాను, పిట్ల ప్రేమ్,




