Siddipet: సిద్దిపేటలో వినాయక మండపాలను దర్శించుకున్న బీఆర్‌ఎస్ నేతలు!
Siddipet: సిద్దిపేటలో వినాయక మండపాలను దర్శించుకున్న బీఆర్‌ఎస్ నేతలు.. వార్డుకు ఒకే మట్టి వినాయకుడిని ప్రతిష్టిస్తే పర్మినెంట్ షెడ్ కానుక ఇస్తామన్న హరీష్ రావు.
Siddipet: సిద్దిపేటలో వినాయక మండపాలను దర్శించుకున్న బీఆర్‌ఎస్ నేతలు!
Siddipet: సిద్దిపేట పట్టణం లో బి ఆర్ ఎస్ పార్టీ నేతలు పట్టణం లో వర సిద్ది వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణం లోని లింగారెడ్డి పల్లి గ్రామం లోని న్యూ ఫ్రెండ్స్ యూత్, త్రిషల్ యూత్, యువ యూత్, అంబేద్కర్ యూత్, ఫ్రెండ్స్ యూత్, ఛత్రపతి శివాజి యూత్, బజరంగ్ దళ్ యూత్, సిద్ది వినాయకులను దర్శించుకున్నారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ కనకరాజు, సీనియర్ నాయకులు భూపేష్, పాల సాయిరాం, బర్ల మల్లి ఖార్జున్, ఎడ్ల అరవింద్ రెడ్డి తదితరులు కలసి పట్టణం లో గణపతి మండపాలలో సిద్ది వినాయకున్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సకల కార్యాలకు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని పూజిస్తే అన్ని మంచి జరుగుతాయని, యా స్వామి దయతో ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.
యువత ఐక్యత తో ఉండాలని ఒక వార్డ్ కు ఒకే వినాయకుడు మట్టి వినాయకున్ని ప్రతిష్టించాలని చెప్పారు.. కలసి కట్టుగా వార్డ్ కి ఒక్క వినాయకుడు మట్టి వినాయకుణ్ణి ప్రతిష్టస్తే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు శాశ్వత గణపతి మండప నిర్మాణానికి సహాయాన్ని అందిస్తాడని చెప్పారు.. యువత, వార్డ్ ప్రజలు ఐక్యత తో ఉండాలి.. పర్యావరణ పరిరక్షణ కు పాటు పడాలని చెప్పారు.




