Siddipet: సిద్దిపేట సభలో మైనారిటీలకు అవమానం: రేవంత్‌పై బీఆర్ఎస్ ఫైర్!

Siddipet: సిద్దిపేట సభలో మైనారిటీలకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నేత అబ్దుల్ అజీజ్ రేవంత్ రెడ్డిపై విమర్శించారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు.

RAJU, SIDDIPET
Published on: 21 Nov 2026 12:57 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేట సభలో మైనారిటీలకు అవమానం: రేవంత్‌పై బీఆర్ఎస్ ఫైర్!

Siddipet: సిద్దిపేటలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మైనారిటీలకు అవమానం జరిగిందని, మైనారిటీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిద్దిపేట BRS యూత్ మైనారిటీ వింగ్ నియోజకవర్గ ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ md layeeq concency incharge విమర్శించారు. సిద్దిపేట లో ఆయన మాట్లాడుతూ మైనారిటీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.

మైనారిటీలకు రూ.5,000 నుంచి రూ.12,000 వరకు ఇస్తామని ప్రకటించిన ఇమామ్, మౌజన్ గౌరవ వేతనాల హామీ ఏమైందన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రూ.18,000 వరకు గౌరవ వేతనం ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు.అలాగే,

ముస్లింలకు ఇచ్చిన షాదీ ముబారక్ పథకం కింద తులం బంగారం హామీ ఏమైందన్నారు. మైనారిటీలకు సెట్విన్ (SETWIN) ద్వారా కుట్టు మిషన్లు అందించే పథకం ఏమైంది? సిద్దిపేటలో మైనారిటీల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ఏం చేశారు? హజ్ కమిటీ అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడలేదు?

ముస్లింలకు సంబంధించిన ఖబరస్తాన్ల సమస్యలపై ఎందుకు స్పందించలేదు? ఇవన్నీ హామీలుగానే మిగిలిపోయాయని విమర్శించారు. మైనారిటీలు ఓటేస్తేనే కాంగ్రెస్.. మరి ఇప్పుడు ఎందుకీ నిర్లక్ష్యం?

'ముస్లింలు కాంగ్రెస్‌కు అండగా ఉంటేనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అని చెప్పిన నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

సిద్దిపేట బహిరంగ సభ వేదికపై స్థానిక కాంగ్రెస్ మైనారిటీ నాయకులకు తగిన ప్రాధాన్యత ఎందుకు కల్పించలేదు? మైనారిటీలను ఎందుకు తక్కువగా చూస్తున్నారు? అని నిలదీశారు.

మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందించింది కేసీఆర్ ప్రభుత్వమే! షాదీ ముబారక్, సెట్విన్ కుట్టు మిషన్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇమామ్‌ల గౌరవ వేతనాలు వంటి పథకాలను గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తుచేశారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హామీలకే పరిమితమైందని విమర్శించారు.

రేవంత్ రెడ్డి.. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు! రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా మేల్కోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోసారి ప్రజల మద్దతు లభించడం కష్టమని వ్యాఖ్యానించారు.

సిద్దిపేట అభివృద్ధి విషయంలో మైనారిటీలకు అండగా నిలిచిన నాయకుడు హరీశ్ రావు అని పేర్కొంటూ, ముస్లింల అభివృద్ధి గురించి మాట్లాడే ముందు గతంలో అమలు చేసిన పథకాలను గుర్తుచేసుకోవాలని సూచించారు. 'కేసీఆర్ సాబ్ పథకాలు.. కాంగ్రెస్ సర్కార్ స్కామ్‌లు' అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

మైనారిటీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వారిని రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించుకోవడం మానుకోవాలని డిమాండ్ చేశారు. నీకు సత్తా ఉంటే సిద్దిపేట నుండి స్వయంగా నువ్వే పోటి చేయాలనీ తమ సత్తా ఎంటో చూప్పిస్తామని తెలిపారు. సమావేశం లో ఎ ఎం సి మాజీ డైరెక్టర్స్ బాబుజాని, ఆదాబ్ మొయిజ్, నాయకులు చాంద్ తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET