Siddipet: దుబ్బాకలో బీఆర్ఎస్ శ్రేణుల ఉత్సాహం.. ఘనంగా ఆవిర్భావ వేడుకలు

Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్‌లో ఘనంగా బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

KARUNAKAR,	DUBBAK
Published on: 27 April 2026 1:41 PM IST
Siddipet
X

Siddipet: దుబ్బాకలో బీఆర్ఎస్ శ్రేణుల ఉత్సాహం.. ఘనంగా ఆవిర్భావ వేడుకలు

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం చీకోడ్ లో బిఆర్ ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని మాజీ సర్పంచ్ తౌడ శ్రీనివాస్ సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామ అధ్యక్షుడు బొందనగారి మల్లేశం బీఆర్ ఎస్ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలు ఇచ్చిన నినాదాలు గ్రామంలో మార్మోగాయి. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ అధికారంలోకి రావదానికి ప్రతి కార్యకర్త పని చేస్తామని ప్రతిన బునారు. రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో చీకోడ్ లో సత్తా చాటుతామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు షరీఫ్, రజిత నర్సింలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, అరుణోదయ సురేశ్, నాయకులు పెంటం రాజు, మాడ అశోక్, గడ్డం నరేష్, చెలుకల శ్రీనివాస్ రెడ్డి, దొడ్ల కిషన్ గౌడ్, నాందిరి భిక్షపతి, కుంబాల రాజు, అలుగుల్ల దేవయ్య, కమ్మరి శ్రీనివాస్, బొందన్నగారి యాదగిరి, కాసారం కృష్ణ, బొంగురపు వెంకటరెడ్డి, ఇనుప శ్రీకాంత్, బాయికాడి శివ కుమార్, MD రఫీ, పసుపునూరి దేవరాజు, గొట్టిగళ్ల చంద్రం, మోసర్ల ఎల్లారెడ్డి, గడ్డం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story