Siddipet: దుబ్బాకలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ భారీ మద్దతు!

Siddipet: దుబ్బాక ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతలు సంఘీభావం ప్రకటించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 24 April 2026 1:42 PM IST
Siddipet
X

Siddipet: దుబ్బాకలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ భారీ మద్దతు!

సిద్దిపేట జిల్లా: దుబ్బాక ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన కోర్కెల కోసం చేపట్టిన సమ్మెకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ వెన్నంటే ఉండి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని దుబ్బాక మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఇల్లందుల శ్రీనివాస్ గారు పేర్కొన్నారు. గౌరవనీయులైన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఈరోజు దుబ్బాకలో జరిగిన ఆర్టీసీ సమ్మెలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని సంఘీభావం ప్రకటించాయి.

ఈ సందర్భంగా ఇల్లందుల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు అనివార్య కారణాల వల్ల నేరుగా హాజరు కాలేకపోయినప్పటికీ, వారి పిలుపు మేరకు మున్సిపల్ పరిధిలోని కార్యకర్తలు, నాయకులు అందరూ తరలివచ్చి సమ్మెను విజయవంతం చేశారని తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని, వారి వెంటే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story