Siddipet: బీఆర్ఎస్, బీజేపీ నేతల అరెస్టు సిగ్గుచేటు..మాదాసు అరుణ్ కుమార్!

Siddipet: సిద్దిపేటలో సీఎం సభ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని తోగుట మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మాదాసు అరుణ్ కుమార్ విమర్శించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 19 Nov 2026 10:45 AM IST
Siddipet
X

Siddipet: బీఆర్ఎస్, బీజేపీ నేతల అరెస్టు సిగ్గుచేటు..మాదాసు అరుణ్ కుమార్!

Siddipet: రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్, బిజెపి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్ పేర్కొన్నారు. సిద్దిపేటలో సీఎం సభ నిర్వహిస్తున్నారని బిఆర్ఎస్, బిజెపి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.

గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.రాష్ట్ర రైతులను ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల ఎక్కడ నిలదీస్తారో అనే భయంతోనే నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషనులకు తరలించడం జరిగిందన్నారు.

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వచ్చే ఎన్నికలలో కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారన్నారు. అరెస్టు చేసిన వారిలో భారతీయ జనతా పార్టీ తోగుట మండల అధ్యక్షులు చిక్కుడు చంద్రం, ఘనపూర్ మాజీ ఎంపీటీసీ కొమ్ము శరత్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంగ నర్సింలు లు ఉన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK