Siddipet: నంగునూరులో బీఆర్‌ఎస్‌వీ మండల సమావేశం.. కాంగ్రెస్‌పై విమర్శలు!

Siddipet: హరీష్ రావు ఆదేశాల మేరకు నంగునూరు మండలంలో బీఆర్‌ఎస్‌వీ నూతన కమిటీల ఏర్పాటుపై సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

RAJU, SIDDIPET
Published on: 4 Oct 2026 5:19 PM IST
Siddipet
X

Siddipet: నంగునూరులో బీఆర్‌ఎస్‌వీ మండల సమావేశం.. కాంగ్రెస్‌పై విమర్శలు!

Siddipet: గౌరవ మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి ఆదేశానూసారం గ్రామ గ్రామాన నూతన బిఆర్ఎస్వి కమిటీల ఏర్పాటు కోసం బిఆర్ఎస్వి మండల కో ఆర్డినేటర్ తప్పేట పర్షరాములు నంగునూరు మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ విద్యార్థుల జీవితాలను అగమ్య గోచరంగా తయారు చేస్తుంది, 12 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలను నడిరోడ్డున నిలబెట్టింది.

విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పుస్తకాలను, దుస్తులను అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గురుకుల విద్యార్థులకు సరైన ఆహారం అందించక 100కు పైగా విద్యార్థులు మరణిస్తే ఈ రేవంత్ సర్కార్ చోద్యం చూస్తుంది.

25 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ, ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, అంటూ గారడి మాటలతో అమలు కాలనీ హామీలతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తుంది కాంగ్రెస్.

రాష్ట్రంలో నేటి పరిస్థితులను చూస్తుంటే కాంగ్రెస్ అసమర్ధ పాలనపై మళ్ళీ విద్యార్థుల ఉద్యమం తప్పదని తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామ గ్రామానికి వెళ్లి గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులను చైతన్యపరిచి నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, విద్యార్థులు, యువత, మహిళలు, తెలంగాణ ప్రజలకు చేస్తున్న మోసం గురుంచి, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామస్థాయి నుంచి ప్రజల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వం తన వాగ్దానాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని BRSV ఆరోపించింది. అదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియాంబర్స్మెంట్ విడుదల చేయక విద్య వ్యవస్థ ను కూని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఉద్యోగ నియామకాలు తదితర విద్యార్థుల సమస్యలను ప్రభుత్వనికి తెలిసే విదంగా BRSV గ్రామ గ్రామ పోరాటం చేస్తాం అని అన్నారు.

విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిద్దాం. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుదాం. ప్రతి గ్రామంలో బిఆర్ఎస్‌వి కమిటీ ఏర్పాటు చేద్దాం. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన వేదికగా నిలుద్దాం.

“ప్రతి గ్రామంలో కమిటీ – ప్రతి విద్యార్థి సమస్యకు పరిష్కారం”

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి మండల కోఆర్డినేటర్ తప్పేట పర్షరాములు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్, మండల ఉపాధ్యక్షులు అప్పాల శేఖర్ యాదవ్, ఏలేటి అనిల్ రెడ్డి, మన్నే బాబు, రంగు చింటూ గౌడ్, ఇమ్రాన్, దుంబాల సాయి గౌడ్, సాయి రెడ్డి, భాను, సాగర్, సోయల్, చిన్నా, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET