Husnabad: మహ్మదాపూర్‌లో అమరుల స్తూపానికి చాడ వెంకట్‌రెడ్డి నివాళి
Husnabad: మహ్మదాపూర్‌లో అమరుల స్తూపానికి నివాళులర్పించిన చాడ వెంకట్‌రెడ్డి.. అనభేరి విగ్రహ పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టుల కాల్వల పూర్తికి డిమాండ్ చేశారు.
Husnabad: మహ్మదాపూర్‌లో అమరుల స్తూపానికి చాడ వెంకట్‌రెడ్డి నివాళి
సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ లో సిపిఐ వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ సాయుధ పోరాట అమరుల స్మారక స్థూపాన్ని సిపిఐ సీనియర్ నాయకుడు చాడ వెంకటరెడ్డి సందర్శించారు.
అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డితో పాటు 10 మంది అమరులకు కార్యకర్తలతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ అమరుల స్మారక స్థలానికి కనీస సౌకర్యాలు లేకపోవడం విచారకరమన్నారు.
అమరుల స్మారకానికి నిధుల కేటాయింపు హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. హుస్నాబాద్ పట్టణంలో తొలగించిన అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
రెండు, మూడు రోజుల్లో విగ్రహాన్ని అదే స్థలంలో ఏర్పాటు చేయాలని కోరారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల కాలువల పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర సీపీఐ దేనని, అమరుల త్యాగాల స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు.




