Thoguta: చందాపూర్ ఐకెపి సెంటర్‌లో వడ్ల కొనుగోళ్లు ప్రారంభం
Thoguta: తొగుట మండలం చందాపూర్ ఐకెపి సెంటర్‌లో హమాలీల కొరతతో నిలిచిపోయిన వడ్ల కొనుగోళ్లను ఏఎంసీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి అధికారులతో కలిసి పునఃప్రారంభించారు.
Thoguta: చందాపూర్ ఐకెపి సెంటర్‌లో వడ్ల కొనుగోళ్లు ప్రారంభం
తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని చందాపూర్ గ్రామంలో ఐకెపి సెంటర్ లోని వడ్ల కొనుగోలు హమాలీ కార్మికుల కొరత ఏర్పడటంతో వడ్లు ఐకెపి సెంటర్ లోనే ఆగిపోవడం జరిగింది ఆవిషయం తెలుసుకున్న AMC మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్) గారు స్థానిక తహసీల్దార్, APM బాబురావు,సీసీ,గ్రామ సర్పంచ్ లావణ్య స్వామి, గార్లతో కలిసి హమాలీ కార్మికలను సమన్వయం చేసి కొనుగోలు ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా తము మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని మండలంలోని ఏ గ్రామంలోనైనా ఐకెపి సెంటర్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైన తమ దృష్టికి తీసుకరావాలని కోరారు. అధికారులు ఎప్పటికప్పుడు ఐకెపి సెంటర్ లు సందర్శిస్తూ రైతుల సమస్యలను తీర్చాలని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహులు,నాయకులు యాదగిరి,కామేష్,రాజు రైతులు తదితరులు పాల్గొన్నారు.




