Siddipet: రైతు సంక్షేమమే ధ్యేయం.. చందాపూర్ సర్పంచ్ దంపతుల చొరవ
Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని చందాపూర్ సర్పంచ్ చందా లావణ్య, స్వామి రైతులకు ఆర్.ఓ.ఆర్ (ROR) నోటీసులను పంపిణీ చేశారు.
Siddipet: రైతు సంక్షేమమే ధ్యేయం.. చందాపూర్ సర్పంచ్ దంపతుల చొరవ
Siddipet: మట్టిని నమ్ముకుని చెమటోడ్చి దేశానికి అన్నం పెట్టే రైతు సోదరుల సేవ అమూల్యం. అలాంటి రైతుల త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని, వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని చందాపూర్ సర్పంచ్ చందా లావణ్య,స్వామి గారు తెలిపారు. ఈ సందర్భంగా 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఆర్.ఓ.ఆర్ (ROR) దరఖాస్తుదారులకు నోటీసులను పంపిణీ చేశారు. నోటీసులు స్వీకరించిన తర్వాత తదుపరి పట్టా ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.రైతుల హక్కుల సాధనలో ప్రతి అడుగులోనూ గ్రామ పంచాయతీ మీతోనే ఉంటుందని, సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. “రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది – రైతు సంక్షేమమే మా ప్రాధాన్యం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ,ఉప సర్పంచ్ ఆత్మకూరి శ్రీకాంత్ ,GPO వెంకటేశం,పాల్గొన్నారు.




