Cherial: చేర్యాలలో నడిరోడ్డుపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన ఎస్ఐ!
Cherial: చేర్యాల పట్టణంలో శుక్రవారం నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని ఎస్ఐ అపూర్వ రెడ్డి, సిబ్బంది కాపాడారు.
Cherial: చేర్యాలలో నడిరోడ్డుపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన ఎస్ఐ!
చేర్యాల: చేర్యాల పట్టణంలో కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా భార్య తల్లి గారి ఇంటి వద్దే ఉంటూ చేర్యాల ఓ సూపర్ మార్కెట్ లో పనిచేసుకుంటుంది ఈ రోజు రమేష్ తన భార్య వద్ద కు వచ్చి డబ్బులు కావాలి అని అడగడం తో ఆమె నిరకరించింది దీనితో కోపగ్రస్తుడైన దాసారం రమేష్ చుంచన కోట క్రాసింగ్ ఒక వైన్ షాప్ ఎదురుగా నడిరోడ్డుపై ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనను గమనించిన చేర్యాల ఎస్ఐ అపూర్వ రెడ్డి, పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి రమేష్‌ను కాపాడారు. అనంతరం చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా రమేష్‌ను గుర్తించారు. పోలీసుల సకాలంలో స్పందనతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు సమాచారం.




