Dubbaka: రైతులకు ఇబ్బందులు కలగకుండా వడ్ల కొనుగోళ్లు చేపట్టాలి

Dubbaka: వడ్ల కొనుగోలు ప్రక్రియపై మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 16 May 2026 1:45 PM IST
Dubbaka
X

Dubbaka: రైతులకు ఇబ్బందులు కలగకుండా వడ్ల కొనుగోళ్లు చేపట్టాలి 

దుబ్బాక: వడ్ల కొనుగోలు విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశించినట్లు దుబ్బాక ఇంచార్జ్ శ్రీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.మంత్రి గారి సూచనల మేరకు నియోజకవర్గంలోని ఏఎంసీ చైర్మెన్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ వడ్ల కొనుగోలు కేంద్రాల రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే స్పందించి, ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిందిగా శ్రీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు నాయకులకు సూచనలు జారీ చేశారు.అలాగే వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించి రైతులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story