Siddipet: ఇందుప్రియాల్‌లో డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రం ప్రారంభం
Siddipet: సిద్దిపేట జిల్లా ఇందుప్రియాల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాన్ని దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
Siddipet: ఇందుప్రియాల్‌లో డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రం ప్రారంభం
Siddipet: వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలు, సాంకేతిక సలహాలు ఒకేచోట అందించాలనే లక్ష్యంతో సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని ఇందుప్రియాల్ గ్రామంలో సూరంపల్లి ప్రవీణ్ ఏర్పాటు చేసిన డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రాన్ని దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో ఆధునిక సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ధ్రువీకరించిన ఎరువులు, నాణ్యమైన పురుగుమందులు మాత్రమే అందించాలని సూచించారు.
వ్యవసాయంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేస్తూ పంటల దిగుబడులు పెరిగేలా సేవా కేంద్రాలు పనిచేయాలని ఆకాంక్షించారు. వ్యవసాయ వ్యయాన్ని తగ్గించి అధిక లాభాలు పొందేందుకు శాస్త్రవేత్తలు సూచిస్తున్న సాగు విధానాలను రైతులకు చేరవేయడంలో ఇలాంటి కేంద్రాలు కీలక పాత్ర పోషించాలని తెలిపారు.




