Mirudoddi: పేదల సొంతింటి కల నిజమైంది.. మల్లుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం!

Mirudoddi: సిద్దిపేట జిల్లా మల్లుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 20 Jun 2026 8:48 AM IST
Mirudoddi
X

Mirudoddi: పేదల సొంతింటి కల నిజమైంది.. మల్లుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం!

సిద్దిపేట జిల్లా: మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఐదు ఇందిరమ్మ గృహాలను ప్రారంభించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కుర్ర ఎల్లయ్య, కర్రె సుజాత-నాగరాజు, ఆఫ్రిన్ బేగం నవాజుద్దీన్, తిప్పర బోయిన మమత-సాయికుమార్, సిద్ధి రంగీల-నరేష్ కుటుంబాలు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ గృహాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో రెండో విడతలో మరిన్ని ఇందిరమ్మ గృహాలకు త్వరలోనే మంజూరు చేస్తామన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story