Dubbak: గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా.. చెరుకు శ్రీనివాస్
Dubbak: సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్ బంజరుపల్లిలో నూతన ఇందిరమ్మ ఇళ్లను దుబ్బాక కాంగ్రెస్ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
Dubbak: గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా.. చెరుకు శ్రీనివాస్
Dubbak: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఎల్ బంజరుపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు గుడిసెలు లేని తెలంగాణ గా నిర్మించడానికి సిఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారన్నారు. మన దుబ్బాక నియోజకవర్గ లో కూడా గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, సర్పంచ్ నర్సింలు, నాయకులు భూపాల్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, కొంగరి నర్సింలు ,పంది రాజు, కృష్ణ గౌడ్, బండారు రమేష్ గౌడ్, వడ్డే కిష్టయ్య, పాల్గొన్నారు.




