Siddipet: కొత్త ఇంట్లోకి పేదలు.. గృహప్రవేశాల్లో సందడి చేసిన కాంగ్రెస్ ఇంచార్జి
Siddipet: దుబ్బాక మండలం రఘోత్తం పల్లిలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Siddipet: కొత్త ఇంట్లోకి పేదలు.. గృహప్రవేశాల్లో సందడి చేసిన కాంగ్రెస్ ఇంచార్జి
సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం రఘోత్తం పల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాల కార్యక్రమాలలో పాల్గొన్నారు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సొంత ఇంటి కల నెరవేరడం అనేది ఒక కుటుంబానికి అతిపెద్ద విజయం. ఆ విజయంలో భాగస్వాములైన మన ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి.ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు.గతంలో ఇందిరమ్మ పాలనలో పేదలకు ఇళ్లు ఎలా దక్కాయో, మళ్లీ అదే రీతిలో అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో సరికొత్త రికార్డులు సృష్టించింది.




