Siddipet: కుళ్లిన గుడ్లు తిని పిల్లలు అస్వస్థత.. దుబ్బాకలో ఘటన
Siddipet: సిద్దిపేట దుబ్బాకలో అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు తినడంతో పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులు ఆందోళన.
Siddipet
Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు అస్వస్థతకు గురైన ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ సెంటర్-1లో పిల్లలకు అందించిన ఉడికించిన గుడ్లు కుళ్లిపోయి ఉండటంతో, వాటిని తిన్న అనంతరం పలువురు చిన్నారులకు వాంతులు, అస్వస్థత లక్షణాలు కనిపించాయి.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్యంపై నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆరోపిస్తూ కేంద్రం ఎదుట నిరసన తెలిపారు.
ఈ ఘటన సమయంలో అంగన్వాడీ టీచర్ సత్యవతి సెలవులో ఉన్నట్లు సమాచారం. స్థానికుల ప్రకారం, కేంద్రంలో నిర్లక్ష్య ధోరణి ఇదివరకూ కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పిల్లలకు నాసిరకం ఆహారం అందించడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఘటనపై అధికారులు దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.




