Dubbaka: వెంకట్రావుపేట గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!

Dubbaka: వెంకట్రావుపేట గ్రామంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ బండారి కవిత స్వామి గౌడ్ కేక్ కట్ చేసి చిన్నారులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 14 Nov 2026 4:17 PM IST
Dubbaka
X

Dubbaka: వెంకట్రావుపేట గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!

Dubbaka: వెంకట్రావుపేట గ్రామంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ గ్రామ సర్పంచ్ శ్రీమతి బండారి కవిత స్వామి గౌడ్ గారు కేక్ కట్ చేసి చిన్నారులతో కలిసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో బాల కార్మిక వ్యవస్థ మరియు బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ, చిన్నారుల హక్కులు మరియు వారి భవిష్యత్తుపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, ఆశ్రిత ఫౌండేషన్ కోఆర్డినేటర్ గణేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రవీందర్, గ్రామస్తులు మరియు చిన్నారులు పాల్గొన్నారు.బాలలే భావి భారత పౌరులు – ప్రతి చిన్నారికి సురక్షితమైన బాల్యం, నాణ్యమైన విద్య, ఉజ్వల భవిష్యత్తు కల్పించడం మనందరి బాధ్యత.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK