Dubbaka: తహశీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు (CITU) ధర్నా!

Dubbaka:దుబ్బాక తహశీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు (CITU) ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 1 July 2026 10:01 AM IST
Dubbaka
X

Dubbaka: తహశీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు (CITU) ధర్నా!

దుబ్బాక: తహశీల్దార్ కార్యాలయం ముందు CITU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహశీల్దార్ మొతిసింగ్ గారికి వినతిపత్రం ఇస్తున్న భవన నిర్మాణ కార్మికులు అనంతరం CITU సిద్ధిపేట జిల్లా కోశాధికారి జి.భాస్కర్ మాట్లాడుతూ భవన మరియు ఇతర

నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణం,సహజ మరణం, శాశ్వత, పాక్షిక అంగవైకల్యం ఈ మూడు స్కీములను ట్రెయిల్ బ్లెజర్ అనే బ్రోకర్స్ సంస్థ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ట్రెయిల్ బ్లెజర్ అనే బ్రోకర్స్ సంస్థకు ఇవ్వడాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేని సిఎస్సి హెల్త్ టెస్టులు చేస్తూ రూ.750 కోట్లకు పైగా ఆ సంస్థకు ఇచ్చి వెల్ఫేర్ బోర్డు సెస్సు నిధులను దుబారా చేస్తున్నారని విమర్శించారు.

1996 భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని వెంటనే నియమించాలని అన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story