Siddipet: పేదల జీవితాల్లో వెలుగులు: సీఎం రేవంత్‌పై అత్తు ఇమామ్

Siddipet: సిద్ధిపేట 9వ వార్డులో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కాంతులు’ కార్యక్రమంలో అత్తు ఇమామ్ పాల్గొని లబ్ధిదారులకు స్వీట్లు, పటాకులు పంచారు.

RAJU, SIDDIPET
Published on: 9 Nov 2026 3:04 PM IST
Siddipet
X

Siddipet: పేదల జీవితాల్లో వెలుగులు: సీఎం రేవంత్‌పై అత్తు ఇమామ్

సిద్ధిపేట: పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ పేద ప్రజల జీవితంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెలుగులు నింపారు అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు అన్నారు.

సిద్ధిపేటలో మునిసిపల్ 9వ వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు నింపే లక్ష్యంతో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కాంతులు’ కార్యక్రమం పండుగ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి సంబురాలు చేసిన సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు స్వీట్లు పటాకులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు మాట్లాడుతూ సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు వారి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపేందుకు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నాం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారంటీలతో పాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది అని అన్నారు.

పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, వృద్ధులు, వికలాంగులు, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పథకాలను రూపొందించింది అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే గృహజ్యోతి ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుండగా, మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది అని రైతు భరోసా రైతులకు పెట్టుబడి సాయంగా ఆరోగ్యశ్రీ ద్వారా పేద కుటుంబాలకు వైద్య భద్రత లభిస్తోంది అని ఎక్కడా లేనివిధంగా రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్నాము అని మహిళలు ఆర్ధికంగా రాణించేందుకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పథకాలను అమలు చేస్తున్నారు అని అన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది అని అన్నారు.

అమలు కానీ హామీలు ఇచ్చి 10 సంవత్సరాలు బిఆరెస్ కెసిఆర్ ప్రజలను మోసం చేశారు అని అన్నారు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి అంటే మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ను ఆశీర్వదించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్యాదారి మధు గయాజుద్దీన్ విజయ్ డానియల్ నజ్జు సంతోషి. స్రవంతి. సాయి తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET